● గోదావరి తీరంలో భారీ సెట్టింగ్‌లు
● సందడిగా దీక్షిత్ శెట్టి సినిమా షూటింగ్
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రకృతి అందాలకు నెలువైన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సినిమా షూటింగ్ జరుగుతోంది. విశ్రామ్ ఫిల్మ్‌స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘శబర’ సినిమా షూటింగ్ కోసం డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడ వద్ద అందమైన పచ్చికబయళ్ల మధ్య భారీ సెట్టింగ్‌లు వేశారు. దసరా, దియా, ది గర్ల్ ఫ్రెండ్ తదితర చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్, హీరోను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు షూటింగ్ ప్రాంతాన్ని బుధవారం సందర్శించారు. ఓ వైపు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ప్రభుత్వం ఎకో టూరిజం ఏర్పాటు చేస్తుండగా, మరో వైపు సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతుండడం గర్వంగా ఉందని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు సంజీవ్‌రాజ్ అన్నారు.


