ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల నియామకం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల నియామకం

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల నియామకం లైబ్రరీ ఫెస్ట్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ పాడి గేదెల పెంపకానికి దరఖాస్తులు ఒకరు డిబార్‌

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1, యూనిట్‌–4 ప్రోగ్రాం ఆఫీసర్లుగా కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, నర్సయ్య నియామకం అయ్యారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి బుధవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. వీసీ తన చాంబర్‌లో శ్రీనివాస్‌, నర్సయ్యకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించనున్న ‘లైబ్రరీ ఫెస్ట్‌ – 2026’ ను విద్యార్థులు విజయవంతం చేయాలని వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు కోరారు. బుధవారం తన చాంబర్‌లో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరితో కలిసి లైబ్రరీ ఫెస్ట్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, పఠన సంస్కృతిని బలోపేతం చేయడమే లక్ష్యంగా లైబ్రరీ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లావణ్య, కోకన్వీనర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఖలీల్‌వాడి: పాడి గేదెల పెంపకం కోసం అ ర్హులైన ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యు వత ఈ నెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వాహక సంచాలకులు శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు మున్సిపల్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో పత్రాలను సమర్పించాలని సూచించారు.

ఖలీల్‌వాడి: నగరంలోని జీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) పరీక్షలలో బుధవారం నిర్వహించిన 6వ, సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల్లో 1,135 విద్యార్థులకు 1,120 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారు. ఒకరు డిబార్‌ అయ్యారు. 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 98 మంది హాజరయ్యారని పరీక్షల నియంత్రణాధికారి భరత్‌రాజ్‌, ఇంచార్జి ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.రంగరత్నం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement