● అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
● అంగన్‌వాడీ టీచర్లకు
స్మార్ట్ ఫోన్ల పంపిణీ
సుభాష్‌నగర్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో అందజేసే పౌష్టికాహారంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. యాప్‌లో పూర్తి వివరాలు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ టీచర్ల సౌకర్యార్థం ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లను అందజేయడం అభినందనీయమని తెలిపారు. గర్భిణులు తమ వివరాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి పద్మ, సీడీపీవో సౌందర్య, కార్పొరేటర్లు జ్యోతి మురళీ, బంటు ప్రీతి ప్రవీణ్, ఇల్లెందుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


