డిచ్‌పల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ వినోద్ తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో గత నెల 28న అర్ధరాత్రి నిందితుడు టమ్ టమ్ నగేష్ అలియాస్ నాగరాజు ఒక ఇంటి తాళం పగులగొట్టి లోనికి వెళ్లి బీరువాలోని బంగారు ఆభరణాలు దొంగిలించాడు. ఇంటి యజమాని యాదగిరి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డిచ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేపీ దాబా వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిహిస్తుండగా అనుమాస్పదంగా కన్పించిన నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపగా సుద్దపల్లిలో చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. దీంతో నగేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కొంతకాలంగా డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివసిస్తూ కూలీ పని చేసుకునే టమ్‌టమ్ నగేష్ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగికి చెందినవాడని ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపారు. నిందితుడిని పట్టుకొని కేసు ఛేదించిన ఎస్సై ఎండీ ఆరిఫ్, హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ దశరథ్‌ను సీఐ వినోద్ ప్రత్యేకంగా అభినందించారు.


