దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యమవ్వాలి

Feb 1 2026 6:32 AM | Updated on Feb 1 2026 6:32 AM

దేశాభ

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యమవ్వాలి

తెయూ (డిచ్‌పల్లి): స్వాతంత్రోద్యమానికి ఊపి రి ఊదిన వందేమాతరం గేయం స్ఫూర్తితో నేటి తరం యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాంబాబు అన్నారు. తెయూలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. వందేమాతరం నినాదం సమైక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అనంతరం డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయం విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందచేశారు. సీబీసీ సహాయ సంచాలకులు కోటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులు స్రవంతి, స్వప్న, స్వామిరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

ఖలీల్‌వాడి: రాబోయే ఎస్సెస్సీ పరీక్షల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సంస్థ డీజీఎం రాము తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయంలో డీఈవో అశోక్‌ శనివారం శ్రీ రామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ చేపట్టిన మిషన్‌ 10వ తరగతి కార్యక్రమం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంస్థ డీజీఎం రా ము మాట్లాడుతూ.. మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంస్థ తరఫున భారీ నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, పట్టుదలను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం రూ. 2.2 కోట్లు నగదు బహుమతులుగా ప్రకటించిందన్నారు. రాష్ట్రస్థాయి మొదటి స్థానాని కి రూ. 5లక్షలు, రెండో స్థానానికి రూ. 3 లక్షలు అందజేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి జి ల్లా టాపర్‌కు రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ స్థాయి టాపర్లకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, మండల స్థాయి టాపర్లకు రూ. 10 వేలు అందజేస్తామన్నారు. సంస్థ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని డీఈవో అన్నారు. సంస్థ డీఎం తానాజీ రావు, బీఎంలు కిశోర్‌, పురుషోత్తం, రాజు ఉన్నారు.

హైకోర్టు జడ్జికి విన్నపాలు

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి శనివారం విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జిలు శ్యామ్‌ కోషీ, నందికొండ నర్సింగ్‌రావులను కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాకు అవసరమైన పదవులు, నిధులపై హైకోర్టు జడ్జి శ్యామ్‌ కోషీకి వినతిపత్రం అందజేశారు.

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యమవ్వాలి 
1
1/1

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యమవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement