పోలీసుల నిర్లక్ష్యంపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల నిర్లక్ష్యంపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

Feb 1 2026 6:32 AM | Updated on Feb 1 2026 6:32 AM

పోలీసుల నిర్లక్ష్యంపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

పోలీసుల నిర్లక్ష్యంపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

ఆర్మూర్‌: తన కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఓ వ్యక్తి హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చే శారు. వివరాలు ఇలా.. ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో ఆర్మూర్‌ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య గతేడాది డిసెంబర్‌లో తన ఇంటి ముందు పార్క్‌ చే సి ఉన్న తన కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేశారు. బాధితుడు ఈ ఘటనపై ఆ ర్మూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ న మోదైనప్పటికీ తనకు న్యాయం చేయడంలో జా ప్యం చేస్తున్నారంటూ ఆరోపించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశా డు. దళిత వ్యక్తినైన తన ఆస్తికి రక్షణ కల్పించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement