అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పథకాల కింద వచ్చిన నిధులతో అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో చందర్ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రధా నంగా నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగంగా పూర్తి చేయించి లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు చేసేలా చూడాలన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న తాడ్వాయి, పిట్లం ఎంపీడీవోలు సయ్యద్ సాజీద్ అలీ, ఎన్.రఘులతోపాటు జెడ్పీ పర్యవేక్షకురాలు విజయలక్ష్మిని ఎంపీడీవోల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ ప్రతినిధులు సంతో ష్‌కుమార్, గోపిబాబు తదితరులు పాల్గొన్నారు.


