బీసీలకు 42శాతం సీట్లు కేటాయించేనా? | - | Sakshi
Sakshi News home page

బీసీలకు 42శాతం సీట్లు కేటాయించేనా?

Feb 1 2026 6:32 AM | Updated on Feb 1 2026 6:32 AM

బీసీల

బీసీలకు 42శాతం సీట్లు కేటాయించేనా?

బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలి..

జనరల్‌ స్థానాలను బీసీలకు ఇవ్వాలి..

కాంగ్రెస్‌ పార్టీ వైపు

ఆశావహుల చూపులు

మున్సిపల్‌ ఎన్నికల వేళ

మరోమారు తెరపైకి వచ్చిన అంశం

ఆర్మూర్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లను కాంగ్రెస్‌ పార్టీ కేటాయిస్తుందా అనే అంశం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా, ‘బీ’ ఫాంలతో రాజకీయ పార్టీల అభ్యర్థులను నిర్దారించడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో బీసీలకు పార్టీ పరంగా టికెట్ల కేటాయింపు అంశం మరోమారు తెరపైకి వచ్చింది.

కుల గణన చేపట్టినా..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ కుల గణన చేపట్టింది. ఈ గణన ఆధారంగా దమాశా పద్దతిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్‌లో జీవోలు జారీ చేసింది. అయితే, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదనే నిబంధనతో ఈ పెంపుపై న్యాయపరమైన సవాళ్లు ఎదురవడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీపరంగా బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తామని అప్పట్లోనే హామీనిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 60 వార్డుల్లో బీసీ మహిళకు 12, బీసీ జనరల్‌కు 12 స్థానాలను రిజర్వు చేశారు. ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో బీసీ మహిళకు 7, బీసీ జనరల్‌కు 7 స్థానాలను రిజర్వు చేశారు. బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు బీసీ మహిళలకు 8, బీసీ జనరల్‌కు 7 స్థానాలు కేటాయించారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు బీసీ మహిళకు ఒక స్థానం, బీసీ జనరల్‌కు 2 స్థానాలను రిజర్వ్‌ చేశారు. ఈ వార్డుల గణాంకాల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు పార్టీ పరంగా కేటాయించాలని నిర్ణయిస్తే జనరల్‌ స్థానాల్లో బీసీలకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి పలు జనరల్‌ స్థానాల్లో తమకు టికెట్లు కేటాయించాలంటూ ఆశావహులు పార్టీ నాయకులను కోరుతున్నారు.

రాజకీయంగా బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులను కలిసి వినతి పత్రాలు సమర్పించాం. ఆయా పార్టీల నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –నరాల సుధాకర్‌,

బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చి న హామీ ప్రకారం బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. బీసీ లకు రిజర్వేషన్ల అంశం కోర్టు లో పెండింగ్‌లో ఉంది. కాబట్టి ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ తరపున జనరల్‌ స్థానాల్లో సైతం బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలి. – ఈరవత్రి రాజశేఖర్‌,

ఈఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, ఆర్మూర్‌

బీసీలకు 42శాతం సీట్లు కేటాయించేనా? 1
1/2

బీసీలకు 42శాతం సీట్లు కేటాయించేనా?

బీసీలకు 42శాతం సీట్లు కేటాయించేనా? 2
2/2

బీసీలకు 42శాతం సీట్లు కేటాయించేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement