డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి), సుద్దప ల్లి గ్రామాల్లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీ సీట్ల భర్తీకి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ధర్మారం(బి) గురుకుల కళాశాలలో ఎంపీసీలో 12, బైపీసీలో 11 సీట్లు, సుద్దపల్లి కళాశాలలో ఎంపీసీలో 18, బైపీసీలో 16 సీట్లు భర్తీ చేసినట్లు ప్రిన్సిపాళ్లు మాధవీలత, నళిని తెలిపారు. కౌన్సెలింగ్‌లో వైస్ ప్రిన్సిపాళ్లు స్వప్న, ఎం. ప్రేమలత, సిబ్బంది నూర్నిస బేగం, సుమలత, జ్యోతి, దమయంతి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు కంప్యూటర్ వితరణ
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రముఖ వ్యాపారవేత్త చిట్టాపూర్ ఏనుగు దయానంద్‌రెడ్డి మూడు కంప్యూటర్లు, జైడి రాజ్‌కుమార్ సీనియర్ పీడీ ప్రింటర్‌ను వితరణగా అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, పీడీ గంగామోహన్, ఉపాధ్యాయులు సునీత, మాలతి, కృష్ణ, పల్లె గంగాధర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ గౌతిమి పాల్గొన్నారు.
మహాధర్నాను విజయవంతం చేయాలి
నిజామాబాద్ రూరల్: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద శనివారం నిర్వహించే బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నాను విజయవంతం చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మదాసు స్వామి యాదవ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ధర్నాను బీసీ కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాస్టర్ శంకర్, నారాయణ యాదవ్, గిరి బాబు, సురేశ్, రాజకుమార్, పాండు తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలతో చిరకాల వాంఛ నెరవేరింది
నిజామాబాద్ సిటీ: జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకావడంతో జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేరిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గురువారం పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కళాశాల కోసం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ విశేషంగా కృషి చేశారని అన్నా రు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో పేద విద్యార్థులు ఇంజినీర్లు కావాలనే కల నెరవేరనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీఎంకు సన్మానం
జక్రాన్‌పల్లి: మండల ఏపీఎంగా పని చేసి డిచ్‌పల్లికి బదిలీపై వెళ్లిన రవీందర్‌రెడ్డిని మండల మహిళా సమాఖ్య సభ్యులు గురువారం ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో సతీశ్‌కుమార్, ఏపీవో రవి,సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన స్పాట్ కౌన్సెలింగ్