
రోడ్డు ఆక్రమణల తొలగింపు
నిజామాబాద్ సిటీ: నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి పులాంగ్ వరకు రోడ్డును ఆనుకొని నిర్మించిన సైన్‌బోర్డులు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. నగరవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన ‘శాశ్వత పరిష్కారం చూపేదెప్పుడు..?’ అనే కథనానికి బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. హైదరాబాద్ రోడ్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు, వేణుమాల్ వద్ద అడ్డుగా ఉన్న బోర్డులను తొలగించారు. ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి పులాంగ్ వరకు రోడ్డును ఆనుకుని నిర్మించిన సైన్‌బోర్డులు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారి టి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ప్రతిరోజు ఆక్రమణల తొలగింపు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
సాక్షి కథనానికి స్పందించిన
ట్రాఫిక్, బల్దియా అధికారులు
హైదరాబాద్ రోడ్డులో తొలగిన
ట్రాఫిక్ ఇబ్బందులు

రోడ్డు ఆక్రమణల తొలగింపు

రోడ్డు ఆక్రమణల తొలగింపు