
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ఖలీల్‌వాడి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుదారులతో మర్యాద ఉండాలని ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. నగరంలోని ఐదోటౌన్ పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈసందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది తరచుగా నగరంలోని వార్డులను సందర్శించి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని, సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని ఎస్సై గంగాధర్‌కు సూచించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన వార్డులకు తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు.
దోస్త్ ‘ప్రత్యేక’ ధ్రువపత్రాల పరిశీలన
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో దోస్త్–డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం నిర్వహించినట్లు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. అడ్మిషన్స్ కార్యాలయంలో ప్రత్యేక కేటగిరి పీహెచ్‌సీ (దివ్యాంగులు), సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించామన్నారు. ఎన్‌సీసీలో నలుగురు, స్పోర్ట్స్‌లో ఇద్దరు, పీహెచ్‌సీలో ఒకరు మొత్తం ఏడుగురు విద్యార్థులు పరిశీలనకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎన్‌సీసీ ఆఫీసర్ డాక్టర్ రామస్వామి, తెయూ ఫిజికల్ డైరెక్టర్ నేత, సిబ్బంది రవీందర్‌నాయక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల వేతనాలు పెంచాలి
నిజామాబాద్‌అర్బన్: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం అందించాలని కోరారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్, ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, బి.మల్లేశ్, సాయారెడ్డి, మురళి, లింగం, కిరణ్, రవి, రాజేశ్వర్, హేమలత, సుమలత, శారద, శివకుమార్, లక్ష్మి, రజిని, నవనాథ్, శ్రీనివాస్, లాలయ్య, గంగాధర్, మహేశ్, శ్రీధర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి