
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
నిజామాబాద్‌నాగారం/ జక్రాన్‌పల్లి: నగరంలోని మైనారిటీ గురుకుల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సయ్యద్‌హైదర్ గురువారం తెలిపారు. రాజారాం స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అర్జున్, ధన్‌రాజ్ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–20 విభాగంలో షాట్‌పుట్‌లో అర్జున్, అండర్–18 విభాగంలో 200మీటర్ల పరుగుపందెంలో ధన్‌రాజ్ బంగారు పతకాలు సాధించారు. అనంతరం క్రీడాకారులను, పీడీ కోటేశ్వర్‌ను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అనూష తెలిపారు. రాష్ట్ర స్థాయి అండర్–20 ఉమెన్ కేటగిరి అథ్లెటిక్ పోటీలకు గాయత్రి, నవనీత, మౌనిక, నవిత ఎంపికై నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ అనూష, ఉపాధ్యాయులు అభినందించారు.
సిరికొండ: మండల కేంద్రానికి చెందిన యువకులు గంగరాజు, గౌతమ్ అథ్లెటిక్స్‌లో బంగారు పతకాలు సాధించారని తెలంగాణ జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయిచరణ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో చిట్యాల గంగరాజు, మూడు కిలోమీటర్ల విభాగంలో గౌతమ్‌లు మొదటి స్థానాల్లో నిలిచి బంగారు పతకాలు సాధించారని అన్నారు. అనంతరం యువకులను గ్రామస్తులు అభినందించారు.
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
సిరికొండ: మండలంలోని తూంపల్లికి చెందిన ముగ్గురు క్రీడాకారిణులు జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారని జెడ్పీహెచ్‌ఎస్ పీడీ నాగేశ్ గురువారం తెలిపారు. హైదబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబర్చిన ఆర్ రాజశ్రీ, అక్షయ, బి శ్రీజలు ఎంపికై నట్లు ఆయన పేర్కొ న్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఈ నెల 1 నుంచి 12 వరకు నిర్వహించే జాతీయ స్థా యి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై వీడీసీ సభ్యులతో పాటు ఎంఈవో రాములు,ఇన్‌చార్జి హెచ్‌ఎం మనోహర్, ఉపాధ్యాయు లు, జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగారెడ్డి, రమణ హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక