
సంక్షిప్తం
పడకల్‌లో శతాధిక వృద్ధుడు మృతి
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు (100)కోమటి రమణయ్య గురువారం మృతి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు లింగయ్య ఉన్నాడు. రమణయ్య మృతి చెందే వరకు ప్రతి రోజు అర కి లోమీటరు దూరంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడని గ్రామస్తులు తెలిపారు. రమణ య్య మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
నిజామాబాద్‌అర్బన్: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అడిషనల్ కలెక్టర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిద్ధల నాగరాజు, పోషమైన మహేశ్, వేణు, విశాల్,కాశిఫ్,సాయి, చరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
సిరికొండ: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై రామకృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై తమ జీవిత లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లవద్దన్నారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హైమద్‌పురలో ఆపరేషన్ ఛబుత్రా
ఖలీల్‌వాడి: నగరంలోని హైమద్‌పుర కాలనీలో బుధవారం రాత్రి పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. ఈసందర్భంగా కాలనీలోని రోడ్లపై తిరుగుతున్న 50 మంది యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రివేళల్లో తిరగవద్దని, రోడ్లపై బైక్‌లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 25 వాహనాలకు పత్రాలు లేనందున వాటిని పరిశీలించిన తర్వాత చలాన్‌లు వేసి వాహనాదారులకు అప్పగించారు. ఎస్సై సయ్యద్ ముజాహిద్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
జేసీబీ పట్టివేత
నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గుట్టల నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న జేసీబీ, టిప్పర్‌ను పట్టుకుని సీజ్ చేసినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరిఫ్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అనుమతులు లేకుండా గుండారం గుట్ట నుంచి అక్రమంగా మొరంను తరలుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా మొరం, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షిప్తం