
ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యునిటీ హాల్ నిర్మాణం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ రూరల్: ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యునిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం నగరంలోని 39వ డివిజన్, ఓల్డ్ ఎన్జీవోఎస్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. నిర్మాణానికి తన వంతు సహాయ సహకారం ఉంటుందని అన్నారు. ప్రజల ఉపయోగం కోసం నిర్మిస్తున్న ఈ భవన పనులను త్వరగా ప్రారంభించి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ కృష్ణ, కొండ ఆశన్న, ఇల్లెందుల ప్రభాకర్, పార్శి రాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.