
జిల్లా నేతల కృషి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు వెనుక పలువురి కృషి ఉంది. పీసీసీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ సైతం కళాశాల కోసం పాటుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన రోజున నిజామాబాద్ జిల్లాకు కచ్చితంగా ఇంజినీరింగ్ కళాశాలను సాధిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సైతం జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్యను మరింత చేరువ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసి సాధించారు. ఈ కళాశాలతో నిజామాబాద్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల విద్యార్థులకు మరింత మేలు కలుగనుంది. టీయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అభ్యసించేందుకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా శాసనసభలో పలుమార్లు ప్రస్తావించారు.
సీఎంకు ధన్యవాదాలు
● ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
తెలంగాణ వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయ డంపై నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విద్యార్థులు, విద్యాభిమానుల ఆకాంక్షలు నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళాశాల ఏర్పాటు చేయించడం హర్షణీయమన్నారు.

జిల్లా నేతల కృషి

జిల్లా నేతల కృషి