
బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ రక్షణ
నిజామాబాద్ సిటీ: బడుగు, బలహీనవర్గాలు, గిరి జనులు, ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్ పా టుపడుతుందని, వారికి రక్షణగా పార్టీ ఉంటుందని రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదల సంక్షేమం జరిగిందని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. జిల్లాకేంద్రంలోని హోటల్ హరితలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా శిక్షణా శిబిరం గురువారం ముగిసింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశావ్యాప్తంగా 25వేల మంది ఆదివాసీలు, గిరిజనులను మంచి నాయకులుగా తీర్చిదిద్దాలన్న ల క్ష్యంతోనే ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నా రు. అనంతరం శిక్షణలో పాల్గొన్న కార్యకర్తలకు సర్టి ఫికేట్లు అందించారు. ట్రైకార్ చైర్మన్ తేజావత్ బె ల్లయ్య నాయక్, జిల్లా ఆదివాసీ గిరిజన చైర్మన్ కెతా వత్ యాదగిరి, రాణాప్రతాప్ రాథోడ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, నాయకులు రాహుల్‌బాల, చంద్రు నాయక్, కెతావత్ ప్రకాష్ నాయక్, చాంగుబాయి, సురేష్ నాయక్, సుభాష్ జాదవ్ ఉన్నారు.
రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్
కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్
ముగిసిన ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా శిక్షణా శిబిరం