
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
డొంకేశ్వర్: రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో షాట్‌పుట్ పో టీలకు డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి శివరాజ్ ఎంపికయ్యాడు. ఇటీవల జిల్లా కేంద్రంలోని నాగారంలో జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలు జరిగాయి. ఇందులో శివరాజ్ కుమార్ ప్ర తిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఆగస్టు 3 నుంచి హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో శివరాజ్ కుమా ర్ జిల్లా నుంచి పాల్గొననున్నా రు. ప్రస్తుతం అతడు ఉప్పల్‌వా యి గురుకులంలో ఇంటర్ ఫస్టి యర్ చదువుతున్నాడు.