
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుతున్నామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏవిధమైన కొత్త ప్రాజెక్టులు జిల్లాకు రాలేదన్నారు. తెలంగాణ వర్సిటీ సైతం దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిందేనన్నారు. ఇంజినీరింగ్ కళాశాలతో జిల్లా విద్యార్థులకు ఎనలేని మేలు కలుగుతుందన్నారు.
ఎండిన సోయాబీన్
పంటల పరిశీలన
కమ్మర్‌పల్లి: మండలంలోని ఉప్లూర్‌లో గడ్డి మందు పిచికారీ చేయడంతో ఎండిన సోయాబీన్ పంటలను గురువారం జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. స్వాతి, స్పందన భట్, దినేష్, సంధ్యకిషోర్‌ల బృందం రైతుల నుంచి వివరాలు సేకరించింది. నివేదికను జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌కు అందజేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. వారి వెంట ఏవో రమ్యశ్రీ ఉన్నారు.
3న సీనియర్ జిల్లాస్థాయి చెస్ ఎంపికలు
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3న నగరంలోని అభ్యాస స్కూల్‌లో సీనియర్ మెన్, ఉమెన్ విభాగంలో చెస్ ఎంపిక పోటీలు ఉంటాయని సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తప్పనిసరిగా చెస్‌బోర్డు, ఆధార్‌కార్డు తీసుకొని రావాలన్నారు. వివరాలకు 94400 07004ను సంప్రదించాలన్నారు.
పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే పాదయాత్ర
ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేయడంలో భాగంగా ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లోని పీవీఆర్ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 2న ఆలూర్, గగ్గుపల్లి మీదుగా పాత బస్టాండ్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందన్నారు. 3న ఉదయం పాత బస్టాండ్‌లో శ్రమదానం నిర్వహిస్తారన్నారు. అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, షేక్ మున్ను, బైండ్ల ప్రశాంత్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు