
తెయూలో మిన్నంటిన సంబురాలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దశాబ్దాల కల నెరవేరిందని విద్యార్థి సంఘాల నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు సంబురాలు జరుపుకున్నారు. తెయూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో టీపీసీపీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. నాయకులు పుప్పాల రవి, సాగర్ నాయక్, ప్రిన్సిపాల్ ప్రవీణ్, ప్రొఫెసర్లు కనకయ్య, బాలకిషన్, పున్నయ్య, మహేందర్ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ కొన్నేళ్లుగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతోనే ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిందని జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, సహాయ కార్యదర్శి ప్రిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో..
తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని హర్షం వ్యక్తం చేశారు. ఏబీవీపీ పోరాటాలతోనే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. నాయకులు శివ, సమీర్, సాయి, అక్షయ్, అజయ్, అశోక్, లెనిన్, అఖిల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరుచేయడంపై జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో గురువారం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. విపుల్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఆకుల మహేందర్, పంచరెడ్డి చరణ్, లవంగ ప్రమోద్, నరేందర్ సింగ్ తదితరులున్నారు.

తెయూలో మిన్నంటిన సంబురాలు

తెయూలో మిన్నంటిన సంబురాలు