
బడుల్లో ఆటస్థలాల విస్తీర్ణం ఎంత?
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ఉన్న క్రీడా మైదానాల విస్తీర్ణం ఎంతమేర ఉందో లెక్కించే పనిలో ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు నిమగ్నమయ్యారు. ఆట స్థలాల విస్తీర్ణంను లెక్కించి వాటి స్థితిగతులపై వివరాలు అందించాలని క్రీ డా సమాఖ్య ఇటీవల ఆదేశాలు ఇవ్వడంతో జిల్లావ్యాప్తంగా సిబ్బంది ఆ పనిలోపడ్డారు. చాలా చోట్ల పాఠశాలలకు ఉన్న మైదానాలలో అదనపు గదుల నిర్మాణం, అనువైన చోట షాపింగ్ కాంప్లెక్స్‌ల ని ర్మాణం జరిగింది. ఫలితంగా విద్యార్థులకు ఆటల కోసం అనువైన స్థలం లేకుండాపోయింది. ఈక్రమంలో బడుల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉ ద్దేశ్యంతో క్రీడా మైదానాల విస్తీర్ణం లెక్కలు తీయాల ని పాఠశాలల క్రీడా సమాఖ్య నిర్ధేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 255 ఉన్నత పాఠశాలలు ఉండగా 146 మంది వ్యాయామ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానాల విస్తీర్ణం ఎంత, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇతరత్రా క్రీడల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే వివరాలను గూగుల్ షీట్‌లలో వారు నమోదు చేస్తున్నా రు. క్రీడా సమాఖ్యకు వివరాలను అందించిన తరువాత ప్రభుత్వం ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.
సిబ్బందిని ఆదేశించాం..
పీడీలు,పీఈటీలు ఉన్న పాఠశాలల పరిధిలో క్రీడా మైదానాల వివరాలను నమోదు చేయాలని ఆదేశించాం. మాకు వివరాలను సేకరించాలని రాష్ట్ర క్రీడల సమాఖ్య నుంచి సూచనలు అందాయి. దీంతో క్షేత్ర స్థాయిలో వివరాలను నమోదు చేయాలని సిబందికి వెల్లడించాం. – నాగమణి, ప్రధాన కార్యదర్శి
జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య
జిల్లావ్యాప్తంగా లెక్కలు తీస్తున్న
పాఠశాలల క్రీడా సమాఖ్య
వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశం