
ఆర్మూర్‌లో బోర్డు తిప్పేసిన తిరుమల ట్రేడర్స్
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని ఓ ట్రేడర్స్ దుకాణం బోర్డు తిప్పేసింది. రాయితీపై వస్తువులు అందిస్తామంటూ దుకాణం ఏర్పాటు చేయగా, కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులు పరారయ్యారు. పోలీసులు, బాధితులు తెలిపిన వి వరాలు ఇలా.. పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ ప క్కన గల ఎల్‌వీఆర్ కాంప్లెక్స్‌లో కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు తిరుమల ట్రేడర్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేశారు. ప్రతి వస్తువుపై 40శాతం రాయితీతో పంపిణీ చేస్తా మని వారు ప్రచారం చేశారు. ఫోన్లు, సోఫా సెట్, ఫ్రిడ్జ్, కంప్యూటర్, వాషింగ్ మిషన్, డైనింగ్ టేబు ల్, ఆల్ ఫర్నిచర్స్ ఎలక్ట్రానిక్ తదితర వస్తువుల కోసం ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తే వారం రోజుల్లో వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో వందల మంది ఆర్డర్ ఇచ్చారు. మొదట్లో పలువురికి వ స్తువులను 40శాతం రాయితీతో ఇవ్వడంతో నమ్మా రు. దీంతో ఇటీవల మరింత మంది వస్తువుల కో సం రూ.లక్షల్లో డబ్బులు చెల్లించారు. కాగా వస్తువు ల కోసం బాధితులు దుకాణం వద్దకు రాగా మంగళవారం నుంచి షాపు తెరవకపోవడంతోపాటు వారి ఫోన్లు స్వీచ్‌ఆఫ్ రావడంతో ఆందోళనకు గురయ్యా రు. సిరిగిరి శ్రీనివాస్ అనే బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
రాయితీపై వస్తువులు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులు
మూడు రోజులుగా దుకాణం
మూసిఉండటంతో బాధితుల ఆందోళన