భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య | - | Sakshi
Sakshi News home page

భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య

Jul 31 2025 7:14 AM | Updated on Jul 31 2025 9:04 AM

భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య

భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు కేసు వివరాలను వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలంలోని చిన్న ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన పల్లె సంపూర్ణకు అదే గ్రామానికి చెందిన జాన్సన్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త పల్లె రవిని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నింది. రవిని హత్య చేసిన వారికి రూ.లక్ష నగదు సుపారీగా ఇవ్వాలని జాన్సన్‌కు చెప్పింది. దీంతో జాన్సన్‌ తన స్నేహితులైన చాకలి రాజు, నవీన్‌, మరో 17ఏళ్ల బాలుడిని సంప్రదించాడు. అందులో భాగంగా పల్లె రవికి డబ్బులు అప్పుగా ఇస్తామని నమ్మించి ఈ నెల 24న చిన్న ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన జాన్సన్‌, చాకలి రాజు, తాండూర్‌కు చెందిన నవీన్‌న్‌తోపాటు మరో మైనర్‌ ఎల్లారెడ్డి మండలం పెద్దారెడ్డి గ్రామ సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి మద్యం సేవించారు. అదే సమయంలో జాన్సన్‌తోపాటు చాకలి రాజు సుత్తితో రవి తలపై దాడి చేశారు. దీంతో రవి వారి నుంచి తప్పించుకొని సమీపంలోని ఫామ్‌హౌస్‌లోకి పరుగెత్తాడు. అయినా జాన్సన్‌, చాకలి రాజు వెంబడించి రవిపై మరోసారి దాడి చేసినా రవి మళ్లీ తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా, పల్లె సంపూర్ణ తన భర్తపై జాన్సన్‌, చాకలి రాజుతోపాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై భార్గవ్‌గౌడ్‌ దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సంపూర్ణనే భర్తను హత్య చేయించేందుకు కుట్ర పన్నిందని తెలుసుకున్న పోలీసులు దాడి కేసును హత్యాయత్నంగా మార్చి విచారణ చేపట్టారు. నిందితులు పల్లె సంపూర్ణతోపాటు జాన్సన్‌, చాకలి రాజు, నవీన్‌, ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలతోపాటు మూడు మొబైల్‌ ఫోన్లు, సుత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. కేసును ఛేదించిన ఎస్సైతోపాటు హెడ్‌ కానిస్టేబుల్‌ మనోహర్‌ రావు, కానిస్టేబుళ్లు గంగారాం, సందీప్‌, అన్వరీని ఎస్పీ రాజేశ్‌చంద్ర ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. సమావేశంలో సదాశివనగర్‌ సీఐ సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్లాన్‌

ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన భార్య

తీవ్రగాయాలతో తప్పించుకున్న భర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement