
నీటిపారుదల శాఖలో వేధింపులు!
మోర్తాడ్(బాల్కొండ): నీటి పారుదల శాఖలో కిందిస్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఏఈఈల అసోసియేషన్ చీఫ్ ఇంజినీర్‌కు ఫిర్యాదు చేయడం సర్వత్రా చ ర్చనీయాంశమైంది. ఒకరిద్దరు అధికారులు తమ త ప్పులను కప్పిపుచ్చుకునేందుకు కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తూ పబ్బం గడుపుతున్నారనే ఆరోపణ లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నే కమ్మర్‌పల్లి ఏఈఈగా పని చేస్తున్న నితిన్ మానసిక ఒత్తిడికి గురై ఐదు రోజుల కింద మరణించాడు. ఉ ద్యోగంలో చేరినప్పటి నుంచి నితిన్‌పై ఒత్తిడి పెంచిన అధికారి అనేకమార్లు మానసికంగా బాధపెట్టా రని ఏఈఈల అసోసియేషన్ ఆరోపించింది. పెళ్లి చేసుకొని నెల రోజులు గడువక ముందే నితిన్ విధి నిర్వహణలో మరణించడం అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పెళ్లికి అవసరమైన సెలవు లు ఇవ్వకుండా గైర్హాజరైనట్లు ఉన్నతాధికారి ఒకరు రికార్డులలో చూపారనే విమర్శలున్నాయి. పండుగ లకు సెలవులు ఇవ్వకుండా జీతాన్ని నిలపివేస్తామ ని బెదిరించడంతోనే నితిన్ వేదనకు గురై మరణించాడని అసోసియేషన్ వివరించింది. నితిన్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
ఏఈఈ మృతికి అధికారి వేధింపులే
కారణమని అసోసియేషన్ ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉన్నతాధికారులకు నివేదించాం
నితిన్ మరణంపై వచ్చిన ఆరోపణల విషయం ఉ న్నతాధికారులకు నివేదించాం. చీఫ్ ఇంజినీర్ గురువారం నిజామాబాద్‌కు రానున్నారు. ఆయన విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – యశస్వి, ఎస్‌ఈ, ఆర్మూర్ డివిజన్