
త్వరలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఎత్తివేత
● ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
● సాలూరాలో ఇక తనిఖీలు చేసేది
ఎకై ్సజ్‌శాఖ మాత్రమే..
బోధన్: జిల్లా సరిహద్దులోని ఏకై క రవాణా చెక్‌పోస్టు(సాలూర) ఇక మూతపడనుంది. జాతీయ ర హదారులపై రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చెక్‌పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నాటి సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. చెక్‌పోస్టు ఎత్తివేతకు సంబంధించి ప్రభుత్వం నుంచి త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయ ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. సాలూర చెక్ పోస్టులో ఒక ఎంవీఐ, ఆరుగురు ఏఎంవీఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లు, కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నారు. కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ అమలులోకి తెచ్చిన వాహన్ పోర్టల్ ద్వారా ఇప్పటికే రవాణ శాఖకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. ఇక నుంచి వాహన్ పోర్టల్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది.
దశాబ్దాల క్రితం ఏర్పాటు
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని సాలూర ప్రాంతంలో నాలుగున్నర దశాబ్దాల క్రితం అంతర్రాష్ట్ర చెక్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రారంభంలో గ్రామ బస్టాండ్ కూడలిలో వీడీసీకి చెందిన రేకుల షెడ్డులో ఏర్పాటు చేసి కొన్నేళ్లపాటు అక్కడే కొనసాగించారు. ఆ తర్వాత మంజీర నది ఒడ్డుకు మార్చారు. మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వం సుమారు 10 ఎకరాల భూమి కొనుగోలు చేసి అధునాతన భవనాన్ని నిర్మించింది. భవనంలో అంతర్రాష్ట్ర ఉమ్మడి తనిఖీ ప్రాంగణం పేరుతో రవాణ, వాణిజ్యపన్నుల శాఖ, సివిల్ సప్లయీస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
జీఎస్‌టీ విధానం అమలులోకి వచ్చిన తరువాత వాణిజ్య పన్నుల శాఖను ఎత్తివేశారు. ఆ తరువాత వ్యవసాయ మార్కెట్ కమిటీ, సివిల్ సప్లయీస్ చెక్ పోస్టులు తొలగించారు. ప్రస్తుతం రవాణా శాఖ, ఎకై ్సజ్ శాఖ చెక్‌పోస్టులు మాత్రమే ఉండగా, ఇక నుంచి ఎకై ్సజ్ చెక్ పోస్టు ఒక్కటే మిగలనుంది.
సాలూర శివారులో చెక్ పోస్టు
ఇక్కడి నుంచి రూ.కోట్ల ఆదాయం
ఆర్టీవో చెక్‌పోస్టు ద్వారా నాలుగేళ్ల క్రితం వరకు ఏటా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వాన్నికి ఆదాయం సమకూరేది. వాహన పర్మిట్లు, ఓవర్ లోడ్ అపరాధ రుసుము, ఇతర పన్నుల రూపంలో చెక్‌పోస్టు ద్వారా ఖజానాకు ఆదాయం జమయ్యేది. ప్రస్తుతం ఆదాయం సగానికి తగ్గిపోయింది. ఏసీబీ దాడులతో అనేకసార్లు ఈ చెక్‌పోస్టు వార్తల్లో నిలిచింది.