
వాడి చూడండి.. తర్వాతే నమ్మండి!
డొంకేశ్వర్(ఆర్మూర్): బస్తాల్లో వచ్చే యూరియా వి నియోగాన్ని క్రమంగా తగ్గించాలని, దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ద్రవ రూపంలోని నానో యూరియాను వాడాలని వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. మండల, గ్రామ స్థాయిలో వ్యవసాయాధికారులు రైతులను కలిసి నానో యూ రియా వల్ల కలిగే లాభాలను వివరిస్తూ అపోహాలను పోగొడుతున్నారు. వాడి చూసిన తరువాత నమ్మాలని సూచిస్తున్నారు. లాభాలతోపాటు ఖర్చు తక్కువ కావడంతో జిల్లాలో కొంతమంది రైతులు నానో యూరియాను వినియోగిస్తున్నారు. నమ్మకం ఏర్పడిన తర్వాత బస్తాల యూరియా జోలికి వెళ్లడం లేదు. దీంతో జిల్లాలో నానో యూరియా విక్రయాలు పెరిగినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం యూరియా వినియోగాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
● ఇది గుళికల రూపంలో ఉంటుంది. ఒక బస్తా 45 కిలోలు ఉంటుంది. ఖరీదు రూ.267.
● వరికై తే ఎకరానికి 3 నుంచి 4 బస్తాలు, మొక్కజొన్నకు 4 నుంచి 6 బస్తాలు అవసరమవుతాయి.
● బస్తాల రవాణాకు ఇబ్బందులు. తెచ్చిన వాటిని నిల్వ చేసుకోవడం, మళ్లీ పొలానికి తీసుకెళ్లడం కష్టం. ఖర్చుతో కూడుకున్న పని.
● గుళికల యూరియా ప్రభావం రెండు, మూడు రోజులే ఉంటుంది. పొలానికి వాడిన మొత్తం యూరియాలో 30 శాతమే మొక్కకు అందుతుంది.
● చల్లిన తర్వాత నీటిలో కరిగిపోయి నేల, గాలిలో కలిసిపోయి వాతావరణ, భూ కాలుష్యం జరుగుతుంది. పంట దిగుబడి తగ్గే అవకాశం.
● పొలాల్లో చల్లేందుకు కూలీలు అవసరం, ఖర్చుతో కూడుకున్న పని.
బస్తాల యూరియా
నానో యూరియాపై రైతులకు
విస్తృత అవగాహన
పంటలకు కలిగే ప్రయోజనాలను
వివరిస్తున్న వ్యవసాయ శాఖ