
దవాఖానాలో కాదన్నారు..108 సిబ్బంది చేశారు
బోధన్: బోధన్ మండలం బెల్లాల్‌కు చెందిన గర్భిణి బర్మె లక్ష్మీబాయికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి బుధవారం తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది పరిస్థితి క్రిటికల్‌గా ఉందని నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. లక్ష్మీబాయిని 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది అంబులెన్స్‌ను సారంగాపూర్ వద్ద నిలిపివేశారు. ఈఆర్‌సీపీ వైద్యుడు మనీశ్ సలహా మేరకు కాన్పు చేయగా లక్ష్మీబాయి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డలను నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీబాయికి సాధారణ కాన్పు చేసిన 108 అంబులెన్స్ ఈఎంటీ లక్ష్మణ్, ఫైలట్ జావీద్‌ను వైద్యులు, లక్ష్మిబాయి కుటుంబ సభ్యులు అభినందించారు. బోధన్‌లోని జిల్లా ఆస్పత్రిలో సాధ్యం కాదని చెప్పగా.. 108 అంబులెన్స్‌లో సాధారణ కాన్పు కావడం గమనార్హం.
బోధన్ జిల్లా ఆస్పత్రి నుంచి
జీజీహెచ్‌కు తరలిస్తుండగా..
108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం
సాధారణ కాన్పు చేసిన సిబ్బంది