
రాత్రికి రాత్రే అడ్రస్ మారింది!
మాక్లూర్: మండలంలోని మాదాపూర్ శివారులో కొనసాగిన మాక్లూర్ పోలీస్‌స్టేషన్ దాస్‌నగర్ వద్ద నిర్మించిన నూతన భవనంలోకి రాత్రికి రాత్రే మారింది. దాస్‌నగర్ వద్ద నూతన భవనం నిర్మించినప్పటికీ పోలీస్ స్టేషన్ అక్కడికి ఎప్పుడు తరలిస్తారనేదానిపై స్పష్టత లేదు. మంగళవారం రాత్రి వరకు మాదాపూర్‌లో కొనసాగిన స్టేషన్ కార్యకలాపాలు బుధవారం ఉదయం దాస్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి. మాదాపూర్‌కు వచ్చిన పలువురు ఇక్కడి నుంచి స్టేషన్ తరలిపోయిందని తెలుసుకుని అవాక్కయ్యారు. స్టేషన్ తరలిస్తున్నట్లు లేదా తరలినట్లు కనీసం ఎక్కడా బోర్డు ఏర్పాటు చేయలేదని విస్మయం వ్యక్తం చేశారు.
మాదాపూర్ నుంచి దాస్‌నగర్‌కు
తరలిన మాక్లూర్ పీఎస్