
విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు భిక్కనూరు ఏఎస్సై నర్సయ్య తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మహమ్మద్ గౌసొద్దీన్ (55) మంగళవారం స్నానం చేసేందుకు తన ఇంట్లో వాటర్ హీటర్ ఆన్ చేయడానికి యత్నిస్తుండగా విద్యుత్ సరఫరా జరిగి కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సై తెలిపారు.
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి...
ఖలీల్‌వాడి: నగరంలోని వీక్లీ మార్కెట్ కల్లు దుకాణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. కల్లు దుకాణం సమీపంలో ఈనె 26న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయస్సు సుమారు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతడు గోధుమ రంగు షర్టు, ఆరెంజ్ కలర్ స్వెటర్, నీలి రంగు ప్యాంట్, తలకు ముస్లింలు ధరించే టోపీ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతుడు కూలీ పని చేసుకునేలా ఉన్నాడని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఎవరికై నా సమాచారం తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గాని, 8712659714కు సమాచారం అందించాలన్నారు.