చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Jul 30 2025 6:46 AM | Updated on Jul 30 2025 6:46 AM

చురుగ

చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

నిజామాబాద్‌అర్బన్‌: అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని సమన్వయంతో పనిచేస్తా మని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశంలో అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి పరిష్కరిస్తామన్నారు. విద్య, వైద్యం, ఇరిగేషన్‌లో సమస్యల పరిష్కారానికి సమన్వయంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.20 కోట్లు అందించడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వానాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూశారని అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు పరిష్కారం చూపుతామన్నారు. ఉమ్మడి జిల్లాలో సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బీసీ రిజర్వేషన్లపై నిరసన తెలుపడం సరికాదన్నారు. సమావేశంలో మాజీమంత్రి, బోధన్‌ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. అర్బన్‌ ఎమ్మె ల్యే ధనపాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో గాదేపల్లి వద్ద ఎకో టూరిజం ఏర్పాటు పై అనుమానాలు కలుగుతున్నాయి. స్థల సేకరణ విషయంలో అటవీ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఓవైపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా... గాదేపల్లిలో వాచ్‌ టవర్ల ఏర్పాటు కోసం ఇంత వరకు అనువైన స్థలమే దొరకడంలేదు. అయితే ఇది వరకు సర్వే చేసిన ఒక స్థలం శ్మశాన వాటిక పక్కనే ఉందనే కారణంతో అధికారులు దానిని తిరస్కరించారు. దీంతో స్థల సేకరణ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మరో చోట స్థలం లేకపోవడంతో అధికారులు గ్రామస్తుల సహకారాన్ని కోరుతున్నారు. దీనికోసం త్వరలోనే అధికారులు మరోసారి బ్యాక్‌వాటర్‌ ప్రాంతానికి రానున్నట్లు తెలిసింది. ఒక వేళ గ్రామస్తులు ముందుకు రాని పక్షంలో గాదేపల్లి వద్ద ఎకో టూ రిజం ఏర్పాటుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పకనే చెప్తున్నారు.

సమన్వయం లేక..

సహకారం లభించక...

జిల్లాలో ఎకో టూరిజం ఏర్పాటుకు బీజం పోసిందే డొంకేశ్వర్‌ మండలంలోని గాదేపల్లి వద్ద ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం. కృష్ణ జింకలు, విదేశీ పక్షులు, పచ్చిక బయళ్లతో ఇక్కడ కనువిందుగా ఉంటుంది. అందుకే గాదేపల్లి వద్ద అత్యధికంగా 18 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. నందిపేట్‌ మండలం ఉమ్మెడ వద్ద 1.20 ఎకరాలు, బాల్కొండ మండలం జలాల్‌పూర్‌ వద్ద మూడెకరాలకు స్థల సేకరణ ఎప్పుడో పూర్తయింది. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా గాదేపల్లి వద్దనే. అటవీ అధికారులకు ఎస్సారెస్పీ ఇరిగేషన్‌ అధికారుల సహకారం లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోని భూములను సైతం ప్రభుత్వం కేటాయించిన 18 ఎకరాల స్థలంలో చూపెట్టారు. తద్వారా వాచ్‌ టవ ర్లు, రిసార్టులు, పార్కింగ్‌ ఏరియా, ఇతర వసతులు కల్పించడానికి స్థలం లేకుండా పోయింది. కాగా శ్మశాన వాటిక పక్కనే ఎకరం స్థలాన్ని గుర్తించిన అఽ దికారులు ఇది ఇబ్బందికరంగా ఉంటుందని వెనక్కి తగ్గారు. మరే దగ్గర స్థలం లేకపోవడంతో అటవీ అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. ముంపునకు గురై ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన వారికి నచ్చజెప్పి భూములను తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ సమస్యగా మారుతుందేమోనని ఎస్సారెస్పీ ఇరిగేషన్‌, అటవీ శాఖల అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఇటు గ్రామస్తులు కూడా సెంటు భూమిచ్చినా కూడా తమ భూములు ఎక్కడ పోతాయోననే భయంతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే తప్పా గాదేపల్లి వద్ద స్థల సేకరణకు పరిష్కారం దొరికే పరిస్థితైతే కనిపించడం లేదు. త్వరలోనే గ్రామస్తులతో సమావేశమై వాచ్‌ టవర్ల కోసం అనువైన మరొక స్థలాన్ని సేకరించడానికి పయత్నాలు చేస్తామని అటవీ శాఖకు చెందిన అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు.

ప్రజాప్రతినిధులందరినీ

కలుపుకుని ముందుకు..

పెండింగ్‌ సమస్యలను పరిష్కరిస్తాం

మీడియాతో మంత్రి సీతక్క

స్థల సేకరణకు ఎదురవుతున్న

అడ్డంకులు

అనువుగా లేని ఇదివరకు

ఎంపిక చేసిన స్థలం

గ్రామస్తులు సహకరిస్తేనే

మరొకచోట స్థలం దొరికే అవకాశం

లేదంటే ఎకో టూరిజంపై

ఆశలు వదులుకోవాల్సిందేనా..?

చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం1
1/2

చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం2
2/2

చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement