
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి
● కూరగాయల సాగు దిశగా ఎస్‌హెచ్‌జీలను ప్రోత్సహిస్తాం
● పైలట్ ప్రాజెక్టుగా జిల్లా.. ఆ తరువాత రాష్ట్రమంతా అమలు చేస్తాం
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వనమహోత్సవంపై
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సమీక్ష
● భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
ఆయా విభాగాల వారీగా వివరాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంత్రి సీతక్క దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు అప్రమత్తతతో అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టరేట్‌తోపాటు ఆయా శాఖల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి సాధించామని, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ సజావుగా సాగుతోందని తెలిపారు.
ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించేలా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్తేనే సమస్యలు తెలుస్తాయని, అప్పుడే పరిష్కారానికి వీలుంటుందని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వనమహోత్సవం, రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై సమీక్షించిన మంత్రి.. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.