
వాగులను దాటే ప్రయత్నం చేయొద్దు
సిరికొండ: వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటే ప్రయత్నం చేయొద్దని పోలీస్ కమీషనర్ సాయిచైతన్య సూచించారు. వర్షాల నేపథ్యంలో తూంపల్లి వద్ద కప్పలవాగును, కొండూర్ వద్ద గల లో లెవల్ వంతెనను, సిరికొండ సమీపంలోని దొండ్ల వాగును సీపీ మంగళవారం పరిశీలించారు. ఆయా చోట్ల స్థానికులతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలిపి, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీపీ వెంట ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ ఉన్నారు.
రేపు స్పాట్ కౌన్సెలింగ్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మ ల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల, బాలుర కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం గ్రూపుల్లో సీట్ల భర్తీకి గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జోనల్ అధికారి పూర్ణచందర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జోన్ పరిధిలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర, బాలికల కళాశాలల్లో 31న ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని, తాము చేరాలనుకుంటున్న కళాశాలలో అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు. అడ్మిషన్లు రిజర్వేషన్, పదో తరగతి మార్కుల ప్రాతిపాదికన కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.
జాతీయస్థాయి హాకీకి ఎంపిక
సిరికొండ: జాతీయ స్థాయి హాకీ పోటీలకు తూంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు తోయేటి లో కేశ్, పుల్లింటి విశాల్ ఎంపికై నట్లు జెడ్పీహెచ్‌ఎస్ పీడీ నాగేశ్ మంగళవారం తెలిపారు. గత నెలలో ఆదిలాబా ద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల్లో ప్రతిభ కనబర్చి జా తీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. జాతీ య స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు తమ పాఠశాల పూర్వ విద్యార్థులు కావడంతో ఏంఈవో రాములు, ఇన్‌చార్జి హెచ్‌ఎం మనోహర్, వీడీసీ సభ్యులు, జిల్లా హకీ అ సోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగారెడ్డి, రమణ హర్షం వ్యక్తం చేశారు. ఎంపికై న క్రీడాకారులు చైన్నెలో వచ్చే నెల 8వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని పీడీ తెలిపారు.
హుండీ ఆదాయం లెక్కింపు
నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండాబాలాజీ ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. రెండు నెలల కాలానికి రూ.96,371 ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ లవంగ ప్రమోద్ తెలిపారు. చైర్మన్, ధర్మకర్తలు, కార్యనిర్వహణ అధికారి వేణు నేతృత్వంలో భక్తులు ఆదాయాన్ని లెక్కించగా, ఆలయ పరిశీలకులు కమల, దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు.
నవోదయలో 9,11
తరగతుల్లో ప్రవేశాలు
నిజామాబాద్‌అర్బన్: నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 2026 ఫిబ్రవరి 7వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయంలో ఖాళీలకు సంబంధించి సీట్లను భర్తీ చేస్తామని, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వాగులను దాటే ప్రయత్నం చేయొద్దు

వాగులను దాటే ప్రయత్నం చేయొద్దు