
నడిరోడ్డుపై గుంత.. వాహనదారులకు చింత
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి–నిజామాబాద్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఇటీవల నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి గుంతలు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
నగరంలోని ఆర్యనగర్‌లో..
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్యనగర్‌లో రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు గుంతల్లో చేరడంతో వాహనదారులు గుంతలను గమనించకుండ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికై న స్పందించిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

నడిరోడ్డుపై గుంత.. వాహనదారులకు చింత