
నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్
రుద్రూర్: నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారంలో సోమవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు తీసుకువస్తే వాహనాలను విడుదల చేస్తామన్నారు. ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పదంగా కన్పించినా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బోధన్ సీఐలు విజయ్ బాబు, వెంకటనారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, కోటగిరి, రుద్రూర్, వర్ని ఎస్సైలు సునీల్, సాయన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సోమవారం స్థానిక పోలీస్‌ల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌వో వినోద, హెడ్‌కానిస్టెబుల్ మల్లేశ్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులున్నారు.