
గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
నిజామాబాద్ నాగారం: గర్భిణులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారిణి రాజశ్రీ అన్నారు. నగరరంలోని దుబ్బ జిల్లా పరిషత్ స్కూల్‌లో సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఆమె గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్, బ్లౌజ్ పీస్, ప్రొటీన్ పౌడర్, పళ్ళు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతి నెల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, మందులపై అవగాహన కల్పించారు. అధ్యక్షు డు పాకాల నరసింహారావు, కార్యదర్శి గంజి రమే ష్, ట్రెజరర్ పాల్తి రక్షిత్ కుమార్, స్వాతి ఠాకూర్, రంజిత్ సింగ్ ఠాకూర్, బంగారి వీరబ్రహ్మం, రాచకొండ గౌరీ శంకర్, నాలం గిరీష్ కుమార్, గైనకాలజిస్ట్ అరుణ తదితరులు పాల్గొన్నారు .