
పర్యావరణాన్ని కాపాడాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణంను కాపాడాలని లయన్స్ క్లబ్ పోర్ట్ సిటీ అధ్యక్షుడు అట్లూరి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. మాధవ నగర్ రామాలయం వద్ద సోమవారం లయన్స్ క్లబ్ ఫోర్ట్ సిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్య రహిత దేశం నిర్మాణం కోసం సంకల్పం చేపట్టాలన్నారు. శివరామకృష్ణ, రాఘవేంద్రరావు, మైలారం నారాయణరెడ్డి, నరసింహచారి, పొందూరి చిలుకమ్మ, లక్ష్మీ నర్సయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు .