
ప్రజలు లేకుండానే ఈజీఎస్ ప్రజావేదిక
బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలో సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నాల్గో విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను ప్రజలు లేకుండానే నిర్వహించారు. సమాచారం ఇవ్వకుండానే ప్రజావేదిక నిర్వహించడంపై ఉపాధి కూలీలకు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈజీఎస్ సిబ్బందితోనే కార్యక్రమాన్ని ముగించారు. అంతకుముందు అడిట్ వివరాలను డీఆర్‌పీలు చదివి వినిపించారు. మస్టర్లలో కూలీల పేర్లు నమోదు చేయకపోవడాన్ని గుర్తించారు. కూలీలకు వేతనాలు చెల్లించడం, పేర్లు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో సాయాగౌడ్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ, ఎంపీడీవో కొండ లక్ష్మణ్, ఇన్‌చార్జి ఏపీవో అశోక్, అంబుడ్స్‌మెన్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.