
క్రైం కార్నర్
బస్సు ఢీకొని ఒకరి మృతి
కామారెడ్డి క్రైం: టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి పైకి ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు దూసుకువచ్చిన ఘటన జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పైడాకుల నారాయణ (55) కామారెడ్డి– సిరిసిల్లా రోడ్‌లోని ధర్మశాల పక్కన ఉండే ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై విధులకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

క్రైం కార్నర్