
గుంజిళ్ల మాస్టారుకు ‘ఆయుష్ ఉదయ్ సమ్మాన్’ అవార్డు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్, గుంజిళ్ల మాస్టారుగా పేరొందిన అందె జీవన్‌రావు ‘ఆయుష్ ఉదయ్ సమ్మాన్’ అవార్డు అందుకున్నారు. ఆదివారం దక్షిణ గోవాలోని ఐటీసీ ఫార్చూన్ రిసార్ట్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆయుష్ కాంక్లేవ్ సదస్సులో అందె జీవన్ రావుకు గోవా కార్టోరిమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, గోవా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అలెక్సో రెజినాల్డో లారెంకో అవార్డు అందజేశారు. ఈ సదస్సులో అందె జీవన్ రావు ‘సూపర్ బ్రెయిన్ యోగా– ఎన్ అప్రొప్రియేట్ యోగిక్ ఎక్సర్ సైజ్ ఫర్ సుపీరియర్ ఇంటెలెక్ట్ అండ్ వెల్ బీయింగ్’ అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు.