
భావితరానికి స్ఫూర్తినిచ్చే.. బతుకు చిత్రం
పదేళ్ల కిందటి వరకు ఏ గ్రామానికి వెళ్లినా ఎడ్లబండ్లు కనిపించేవి. పొలాల్లో దుక్కులు చేయాలంటే నాగళ్లు, అరకలు వాడేవారు. అందుకు ఎడ్లు అవసరం. పండిన పంట ఇంటికి చేర్చాలంటే ఎడ్లబండ్లు వాడేవారు. వ్యవసాయంలో నేడు యాంత్రీకరణ పెరిగిపోయింది. ఎక్కడా ఎడ్లబండ్లు కనిపించడం లేదు. చదును చేయడం, దుక్కులు దున్నడానికి ట్రాక్టర్లు వచ్చేశాయి. నేటి తరానికి పాత వ్యవసాయ పద్ధతులు తెలిసేలా మోస్రా మండలం చింతకుంట గ్రామస్తులు చందాలు వేసుకొని గ్రామముఖ ద్వారం వద్ద ఎడ్లబండిపై రైతు దంపతులు ధాన్యం తరలించే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్