
ఉపాధి హామీ పనులు భేష్
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు భేషుగ్గా ఉన్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ పర్యవేక్షకులు సుధాకర్ రెడ్డి, లోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జక్రాన్‌పల్లి, చాంద్ మియాబాగ్, మనోహరాబాద్ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరుపై గ్రామసభలు నిర్వహించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎలా ఉపయోగపడ్డాయని అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జక్రాన్‌పల్లితోపాటు వేల్పూర్, కమ్మర్‌పల్లి మండలాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సతీశ్ కుమార్, ఎంపీవో యూసుఫ్‌ఖాన్, జీపీ కార్యదర్శులు గంగాధర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ జాతీయ
పర్యవేక్షకులు సుధాకర్ రెడ్డి