
రైలు కింద పడి ఒకరి మృతి
బోధన్: నిజామాబాద్–జానకంపేట రైల్వేస్టేషన్ల మార్గమధ్యలో సోమవారం గుర్తు తెలియని రైలు కిందపడి 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వేస్టేషన్ మేనేజర్ చందన్ కుమార్ తెలిపారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని రైల్వే ఎస్సై సాయరెడ్డి పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 58591 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇసుక టిప్పర్ల పట్టివేత
వర్ని (మోస్రా): అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున రెండు టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా మోస్రా శివారులో పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. ఈ టిప్పర్లు సాలూర శివారులోని మంజీర పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రైలు కింద పడి ఒకరి మృతి