
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
కామారెడ్డి క్రైం: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి అన్నారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ‘మత్తు పదార్ధాలకు దూరంగా ఉండండి’ అనే సందేశంతో రూపొందించిన వాల్ పోస్టర్‌లను లీగల్ సర్వీసెస్ అధారిటీ కార్యదర్శి విజయ్ కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పట్ణణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో అతికించారు. మత్తు పదార్థాలపై యు వత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
మంకీ గన్లకు భలే గిరాకీ..!
ఎల్లారెడ్డి: కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు. కోతుల నివారణకు మంకీ గన్లు బాగా ఉపయోగపడుతుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. పట్టణంలో మంకీ గన్లు విక్రయించేందుకు రావడంతో స్థానికులు వాటిని కోనుగోలు చేశారు. సుమా రు రూ.150కి విక్రయదారులు అమ్ముతున్నా రు. మంకీగన్లలో సున్నపురాయిని వేసి దానిలో రెండు చుక్కల నీటిని పోసి అటు ఇటు తిప్పి లైటర్‌ను ఆన్‌చేస్తే భారీ శబ్దం రావడంతో కోతు లు పారిపోతున్నాయని స్థానికులు తెలిపారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి