
విద్యుత్ స్తంభాలను ఢీకొన్న లారీ
రుద్రూర్: పోతంగల్ చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం ఓ కంకర లారీ విద్యుత్ స్తంభాలను ఢీకొని బోల్తా పడింది. బీర్కూర్ నుంచి కోటగిరి మండలం ఎత్తోండకు కంకర లోడ్‌తో లారీ బయలుదేరింది. పోతంగల్ శి వారులో మూల మలుపు వద్ద లారీ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో రెండు స్తంభాలు విరిగిపోగ, మరో రెండు దె బ్బతిన్నాయి. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫ రా ఉండగా, వెంటనే అధికారులు సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై విద్యుత్‌శాఖ ఏఈ ఫక్రుద్దిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.80 వేల నష్టం జరిగినట్లు తెలిపారు. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు స్థానికులు తెలిపారు.