
అవస్థల ప్రయాణం ఇంకెన్నాళ్లు?
నిజామాబాద్ రూరల్: మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డంతా గుంతలమయం కావడంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరంత గుంతల్లో చేరింది. దీంతో వాహనదారులు గుంతలను గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
మాధవగర్ ఆర్వోబీ పనులు ప్రారంభమై దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా రోడ్డుపై అక్కడక్కడ తవ్వకాలు జరిపి, పలు నిర్మాణాలు చేపట్టారు. తవ్వకాలను మొరంతో పూ డ్చివేసినా, పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. అలాగే నిత్యం వాహనాల రాకపోకలు, వర్షాల కారణంగా రోడ్డంతా పూర్తిగా అధ్వానంగా మా రింది. పెద్ద పెద్ద గుంతలతోపాటు, పలు చోట్ల రో డ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలకు తీ వ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా రైల్వేగే టు పడితే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. త లమయమైన రోడ్డు గురించి ఇది వరకే ఎన్నో సా ర్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినాప్రయోజనం లేదనిప్రయాణికులు,స్థానికప్రజలువాపోతున్నారు.
సూచికలు, లైటింగ్ కరువు...
ఆర్వోబీ పనులు జరిగే చోట ఎలాంటి ప్రమాద, ప్రయాణ సూచికల బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు అయోమయంలో పడుతున్నారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్వోబీ పనుల వద్ద సూచిక బోర్డులు లేక ఎటునుంచి వెళ్లాలో తెలియక స్థానికులను అడిగి వెళ్లే దుస్థితి ఏర్పడింది. అలాగై లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళలో వాహనదారులు రోడ్డు సరిగా కనబడక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, ఆర్వోబీ పనుల వద్ద రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
రెండున్నరేళ్లుగా సాగుతున్న
మాధవ్‌నగర్ ఆర్వోబీ పనులు
గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మరమ్మతులు చేపట్టని అధికారులు

అవస్థల ప్రయాణం ఇంకెన్నాళ్లు?

అవస్థల ప్రయాణం ఇంకెన్నాళ్లు?