
ప్రమాదపు అంచున పర్యాటకులు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరుతుండటంతో ప్రా జెక్ట్ సందర్శనకు పర్యాటకులు తరలివస్తున్నా రు. కానీ పర్యాటకులు ప్రాజెక్టు లోపలికి వెళ్లడంతోపాటు, నీటి అంచున ఫొటో షూట్‌లు, సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో పర్యాటకులు ప్రమాదవశాత్తు నీటమునిగే ప్రమాదం ఉంద ని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రాజెక్టు అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకముందే తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ప్రారంభమైన
జెండా బాలాజీ జాతర
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జెండాగల్లీలో గల వేంకటేశ్వర ఆలయ ఆవరణలో ఆదివారం స ర్వసమాజ్ ఆధ్వర్యంలో జెండా బాలాజీ జాత ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సంద ర్బంగా జెండాతో ఆలయం చూట్టు ఐదు ప్రదిక్షణలు చే సి, ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ప్రతి ష్ఠించారు. భక్తులు 9రోజుల పాటు ఆలయంలోని జెండాకు పూజలు చేయనున్నారు. అంతకుముందు జెండాతో పట్టణంలో ఊరేగింపు ని ర్వహించారు. ఆగస్టు 5న జెండాను అంకాపూర్ గ్రామాస్తులకు అప్పగించనున్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రె డ్డి జంబిహనుమాన్ ఆలయ ఆవరణలో జెండా కు ప్రత్యేక పూజలు చేశారు. అధ్యక్షుడు కొట్టాల సుమన్, ప్రధాన కార్యదర్శి కర్తన్ దినేష్, సర్వసమాజ్ సభ్యులు పాల్గొన్నారు.
రేపు ఆవు పాల పంపిణీ
నిజామాబాద్ రూరల్: నాగుల పంచమిని పురస్కరించుకొని ఈ నెల 29న గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో ఇందూరు నగరంతోపా టు పలు గ్రామాల్లో 70 ఆవుపాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు టీ రా మ్మోహన్ తెలిపారు. నగరంలోని పెద్ద రాంమందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో సమితి సభ్యులు శంకర్, శ్రీధర్, దయాకర్, సతీశ్, బా లకిషన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో ఆవు పా లు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు వీరమల్లు రమేశ్ తెలిపారు. ఆదివారం సమితి కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. లక్ష్మీకాంతం, కోట యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
‘నిజాంసాగర్’లోకి ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షా ల వల్ల ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,391 అడుగుల (4.47 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

ప్రమాదపు అంచున పర్యాటకులు

ప్రమాదపు అంచున పర్యాటకులు