
వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?
మీకు తెలుసా?
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎప్పుడైన వర్షం కురిస్తే, ఎంత కురిసిందో వాతావరణ శాఖ మాత్రమే చెబుతుంది.
● వర్షపాతాన్ని తెలుసుకునేందుకు రెయిన్ గేజ్‌లను (వర్షమాపకాలు) ఉపయోగిస్తారు. వా టిని వాతావరణ ప్రధాన కేంద్రమైన పూణే లో ప్రత్యేక ల్యాబ్‌లో తయారు చేస్తారు.
● రెయిన్ గేజ్‌లలో రెండు రకాలున్నాయి. ఒకటి సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్. దీనిని నేలపై బోరు పైపులా ఏర్పాటు చేస్తారు. పైపులో గ్రాఫ్ రోలర్ బిగించి ఉంచుతారు. వర్షం పడిన సమయంలో నీరు సన్నని రంద్రంలోకి చేరడం వలన ఎప్పటికప్పుడు గ్రాఫ్‌లో నమోదు చేస్తుంది.
● రెయిన్ గేజ్‌లో రెండో రకం ఆర్డినరీ రెయిన్ గేజ్. ఇది ప్రతి మూడు గంటలకోసారి వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఉదయం 8:30 గంటలకు, 11:30 గంటలకు మధ్యాహ్నాం 2:30 గంటలకు, సాయంత్రం 5:30 గంటలకు వర్షపాతాన్ని తీస్తారు.
● ఇదే పద్దతిలో రాత్రి నుంచి వేకువజాము వరకు కూడా మూడు గంటలకోసారి కొలుస్తారు.
● ఈ ఆర్డినరీ రెయిన్ గేజ్‌లు ప్రతి మండలానికి ఒకటి తహసీల్ ఆఫీసు ఆవరణలో ఉంటుంది. అలాగే సబ్ స్టేషన్లలో కూడా ఉంటాయి.
● వీటి రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. చూడటానికి బోరు పైపు మాదిరిగా ఉంటుంది. సన్నని రంద్రం ద్వారా వర్షపునీరు వెళ్లి లోపల ఉన్న ఒక కంటెయినర్ (డబ్బా)లో చేరుతుంది.
● అలా డబ్బాలోకి చేరిన నీటిని ప్లాస్క్ మగ్‌లో కి పోసి కొలుస్తారు. వర్షపాతాన్ని మిల్లీ మీ టర్లు, సెంటీ మీటర్లలో కొలుస్తారు. 10 మి ల్లీ మీటర్లకు ఒక సెంటీ మీటరు అంటారు.
● ఈ వర్షపాతం వివరాలను సేకరించి ప్రభుత్వాలకు పంపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుంటారు. వాతావరణ శాఖ నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్లు, ముఖ్య ప్రణాళిక శాఖ నుంచి అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ (ఏఎస్‌వో)లు ఉంటారు.