
ఐక్యతతోనే బంజారాల అభివృద్ధి సాధ్యం
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): బంజారా (లంబా డి)లు అందరూ ఐక్యతతో ఉంటేనే అభివృద్ధి సాధ్య మని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములు నా యక్ అన్నారు. మండలంలోని బర్ధిపూర్ శివారులోగల ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు జీవితం అంకింతం చేసిన రామారావు మహారాజ్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బంజారాలు అత్యధిక స్థానాలను గెలిచి రాజకీయంగా రాణించడంతో పాటు తండాల అభి వృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ నాయకులు, మాజీ ఎంపీ సోయం బాపురావు ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తొలగించాలని సు ప్రీంకోర్టులో కేసు వేశారని బంజారాలందరూ ఐ క్యతతో ఆయన కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏఐబీఎస్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేష్ జీ.జాదవ్ మాట్లాడుతూ.. బంజారాలకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలని డి మాండ్ చేశారు. నాయకులు శ్రీహరి నాయక్, కిషన్‌సింగ్ రాథోడ్, పాండునాయక్, రామారావు, మో హన్ నాయక్, పీర్‌సింగ్, రవికుమార్, రాంచందర్‌నాయక్, పుసల నరహరి బదావత్, సబావత్ శివలాల్ నాయక్, మోతీలాల్, జాదవ్ ఓమాజీ, దశర థ్, శివలాల్, చాంగీబాయి తదితరులు ఉన్నారు.