
కొత్త పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలి
నిజామాబాద్ నాగారం: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా రూపొందించిన కొత్త పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ పెన్షనర్ల కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం వారు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. మధ్యతరగతి ఉద్యోగుల పొట్ట కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొస్తుందని, దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు మదన్మోహన్, శిరప హనుమాండ్లు, రాధా కిషన్, జార్జి, పురుషోత్తం, ప్రతాపరెడ్డి, హుస్సేన్, పుష్పవల్లి, లలిత, మేరీ, ప్రసాద్, వెంకట్రావు, సిర్ప లింగయ్య పాల్గొన్నారు.