
ఏపీఎంల బదిలీలు పూర్తి
డొంకేశ్వర్(ఆర్మూర్) : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న ఏపీఎంల బదిలీలు పూర్తయ్యాయి. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సెర్ప్ నుంచి వచ్చిన సీనియారిటీ లిస్టు ప్రకారం ఏపీఎంలకు కౌన్సెలింగ్ చేపట్టి కోరుకున్న మండలాలకు బదిలీలు చేశారు. బదిలీలు పారదర్శకంగా జరగడంతో ఏపీఎంలు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 31 మందిని బదిలీ చేయ గా, శనివారం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. నెలాఖరుకు రిలీవ్ అయ్యి ఆగస్టు 1న కొత్త మండలాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా, కొత్త మండలాలైన డొంకేశ్వర్, ఆలూరు, పొతంగల్, సాలూరలకు ఏపీఎంలను నియమించలేదు. బదిలీల్లో భాగంగా కొత్త మండలాలకు ఏపీఎంలను కేటాయించాలని డీఆర్డీవో, సెర్ప్ సీఈవోకు ఇటీవల లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. కౌన్సెలింగ్‌లో డీఆర్డీవో సాయాగౌడ్, ఏపీడీ మధుసూదన్ ఉన్నారు.
కలెక్టరేట్‌లో 31 మందికి కౌన్సెలింగ్
నిర్వహించిన కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
నేడు పోస్టింగ్ ఆర్డర్లు
అధికారి కేటాయించిన
పేరు మండలం
యెలవర్తి సరళ ని. రూరల్
వి.సరోజిని మోపాల్
అనిల్‌కుమార్ డీఎంఎంయూ
సీహెచ్ ప్రమీల భీమ్‌గల్
బి. గంగారాం బాల్కొండ
ప్రసాద్‌రావు డీఎంఎంయూ
బోలిశెట్టి ఉమాకిరణ్ మాక్లూర్
బస్వాంత్ రావు రుద్రూర్
చిన్నొళ్ల సాయిలు బోధన్
భూమేశ్వర్ గౌడ్ ఆర్మూర్
ఎంఏ ముఖీమ్ ఎస్‌వీఈపీ బోధన్
రవీందర్ రెడ్డి డిచ్‌పల్లి
పుప్పాల గంగాధర్ జక్రాన్‌పల్లి
కె. గంగాధర్ నందిపేట్
మహేశ్ కుమార్ నవీపేట్
డి.శ్యామ్ మోర్తాడ్
బి.మాణిక్యం వేల్పూర్
ఈ.సునీత ఇందల్వాయి
కె. రవికుమార్ డీఎంఎంయూ
ఎస్.గంగాధర్ మోస్రా
గడ్డం హిమబాల ముప్కాల్
బొర్ర గంగాధర్ చందూర్
కుంట గంగాధర్ ఏర్గట్ల
మెట్టు సువర్ణ సిరికొండ
ఎస్. మోహన్ రెంజల్
చిలుక రాజేందర్ ఎడపల్లి
ఈర్నాల చిన్నయ్య ధర్పల్లి
జి.కిరణ్ కుమార్ కమ్మర్‌పల్లి
ఈ. మనోహర్ వర్ని
గంగారాజు మెండోరా
జి. భాస్కర్ కోటగిరి