
ఖాతాదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
డిచ్‌పల్లి: సహకార బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో సిబ్బంది మర్యాదగా మెలగాలని, పారదర్శకంగా సేవలందించి వారి మన్ననలు పొందాలని నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ కుంట రమేష్‌రెడ్డి సూచించారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని సహకార బ్యాంకును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులకు బ్యాంకు లాకర్స్, రుణాలు, డిపాజిట్ సదుపాయాల గురించి అవగాహన కల్పించాలన్నారు. భవిష్యత్‌లో నకిలీ బంగారం అని తేలినా, రుణ మంజూరు ప్రక్రియలో లోపాలు గుర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రమేష్‌రెడ్డి, డైరెక్టర్ ఆనంద్‌లను బ్రాంచ్ మేనేజర్ శ్రావణ, ఫీల్డ్ ఆఫీసర్ మోహన్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సునీత సత్కరించారు. క్యాషియర్ ప్రసన్నకుమారి, స్టాప్‌అసిస్టెంట్ మునీర్‌ఖాన్, విశ్వనాథ్, అటెండర్ రమేష్ పాల్గొన్నారు.